రేవంత్​రెడ్డిది మొండి వాదన: ఏపీ మంత్రి అంబటి

రేవంత్​రెడ్డిది మొండి వాదన: ఏపీ మంత్రి అంబటి
  • తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్టు కూడా మాకొద్దు
  • ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు 

అమరావతి: నదీజలాల పంపిణీని విభజన చట్టంలో పొందుపరిస్తే దానిని అంగీక‌రించ‌మ‌ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మొండిగా వాదిస్తున్నారని ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. ‘నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాలకు సంబంధించినది. ఏపీకి ప్రాజెక్ట్‌లు అప్పగించబోమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం స‌రికాదు. తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్టు కూడా ఏపీకి అవసరం లేదు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించింది’అని గుర్తుచేశారు.