కాళేశ్వరంపై కాగ్ నివేదిక.. అంచనా వ్యయం 42 వేల కోట్లు ఎలా పెరిగింది..?

కాళేశ్వరంపై కాగ్ నివేదిక.. అంచనా వ్యయం 42 వేల కోట్లు ఎలా పెరిగింది..?

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక విడుదల చేసింది. సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ లో 63 వేల 352 కోట్లు  చూపెట్టగా.. లక్షా 6 వేల కోట్లకు అంచనా వ్యయం పెంచినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు లక్షా  47 వేల 427 కోట్లు ఖర్చు అవుతుందని స్పష్టం చేసింది కాగ్.

ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకువచ్చారని తెలిపింది. 15 బ్యాంకులతో  87 వేల కోట్లు సమకూర్చుకోవాలని ఓప్పందం చేసుకున్నారంది. రుణాలు చెల్లించడం లో కాలయాపన చేసిందని తెలిపింది. ప్రాజెక్టు నిర్వహాణ కోసం ప్రతీ సంవత్సరం 700 కోట్ల నుంచి 14 వేల 5 వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది. రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. కాళేశ్వరం అప్పు కట్టంకుంటూ పోతే 2036 లో పూర్తవుతుందని తెలిపింది. 

కాళేశ్వరం 56 పనుల్లో 13 పూర్తి అయ్యాయయని మిగిలనవి పూర్తి కావాల్సి ఉందని తెలిపింది. 2020 - 21లోనే రుణాల చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉందని కానీ 9 ఆగ్రిమెంట్ లను వాయిదా వేయాలని కోరినట్టు చెప్పింది. వడ్డీలకు వడ్డీ 8 వేల182 కోట్లు పెరిగిందని తెలిపింది. కాళేశ్వరం కోసం తెచ్చిన రుణాలలో 1 వెయ్యి 690 కోట్లు మళ్లించారని చెప్పింది. దింతో  అందనంగా 587 కోట్లు వడ్డీ పడిందని తెలిపింది.  ప్రతి ఏటా14 వేల 462 కోట్లు రుణాల చెల్లించాలని కాగ్ నివేదికలో చెప్పింది. 

డీపీఆర్ లో రూ. 63 వేల 352 కోట్లు  చూపెట్టి అంచనా వ్యయాన్ని1లక్షా 6 వేల కోట్లకు పెంచారని నివేదికలో తెలిపింది. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని చెప్పింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ..ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1లక్షా 47 వేల 427 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పింది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలను ఎక్కువగా చూపెట్టారని తెలిపింది. కాళేశ్వరం పై అంతరాష్ట్ర సమస్యలు..నిల్వ సామర్థ్యం.. సౌకర్యం పై సరైన అధ్యయనం చేయలేదని చెప్పింది. అస్తవ్యస్తంగా పనులు ప్రారంభించారని తెలిపింది.

 కాళేశ్వరం ప్రాజెక్టు  వడ్డితో సహా 1 లక్షా 47 వేల 427 కోట్లకు పెరిగిందని తెలిపింది.  ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయని ఫలితంగా 7 వందల67 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పింది. కాళేశ్వరం డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయని చెప్పింది. రి ఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారని తెలిపింది. 2018లో కాళేశ్వరం డీపీఆర్ ని కేంద్ర జలసంగం ఆమోదించక ముందే 17 పనులు 25 వేల 49 కోట్లకు అప్పగించారని చెప్పింది. డీపీఆర్ తరవత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని తెలిపింది.

Also Read:ఎలక్టోరల్ బాండ్లలో బీజేపీ టాప్.. ఒక్క ఏడాదిలోనే 13 వందల కోట్లు

 తొలుత 2 టీఎంసీ ఎత్తిపాతలు ప్రతిపాదించి అవసరం లెకున్న 3 టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని చెప్పింది. దింతో 28 వేల151 కోట్ల అదనపు వ్యయం ఏర్పడ్డదని తెలిపింది. కాళేశ్వరం నిర్వహణకు 10 వేల కోట్లు పడుతోందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి అనుమతి ఇవ్వలేదన్నారు. ఒక్కో పనికి అనుమతి ఇస్తూ పోయిందని చెప్పింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ పేరుతో అప్పులు తెచ్చిందని  87వేల449 కోట్ల రుణాలు తీసుకవచ్చారని తెలిపింది.  బడ్జెట్ నుండి కేవలం 27 శాతం మాత్రమే కేటాయించారని చెప్పింది. కాళేశ్వరం పై ఆదాయం లేదు కాబట్టి రుణాలు చెల్లింపు కష్టం అని కాగ్ హెచ్చరించింది. బడ్జెట్ పై భారం పడుతుందని తెలిపింది. వానాకాలం వచ్చే నీళ్లు వానాకాలం కే సరిపోతాయని యాసంగికి నీళ్లు సరిపోవని కాగ్ నివేదికలో చెప్పింది.