T 20 World CUP: యూఏఈ 173 పరుగులు.. న్యూజిలాండ్ పై మంచి స్కోరే..!

T 20 World CUP: యూఏఈ 173 పరుగులు.. న్యూజిలాండ్ పై మంచి స్కోరే..!

UAE.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. టీ 20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో బాగానే ఆడింది. యూఏఈ జట్టును ఊదేస్తాం అంటూ బరిలోకి దిగిన న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 20 ఓవర్లు మొత్తం ఆడి.. 6 వికెట్లు కోల్పోయి.. 173 పరుగులు చేసింది యూఏఈ జట్టు. వికెట్లు తీయటానికి నానా కష్టాలు పడ్డారు న్యూజిలాండ్ బౌలర్లు.

టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న UAE జట్టులో కెప్టెన్ మహమ్మద్ వశీం 45 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత అలీహనర్ షరాఫ్ 47 బంతుల్లో 55 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలు చేయటంతో డీసెంట్ స్కోర్ చేసింది యూఏఈ జట్టు. 

న్యూజిలాండ్ బౌలర్లలో మాత్ హన్రీ 2 వికెట్లు పడగొట్టగా.. జాకబ్ డఫ్పీ, ఫెర్గూసన్, మైఖల్ శాన్ ట్రన్, ఫిలిప్స్ తలా ఒక వికెట్ తీశారు. UAE జట్టు వికెట్లను వేగంగా తీయటంలో న్యూజిలాండ్ బౌలర్లు విఫలం అయ్యారు. బలమైన .. అనుభవం ఉన్నన్యూజిలాండ్ జట్టుపై.. UAE 173 పరుగులు చేయటం విశేషం. 

న్యూజిలాండ్ టార్గెట్ 174 పరుగులు. ఇప్పుడు UAE బౌలర్లు ఏ విధంగా రాణిస్తారో చూడాలి. ఒక వేళ యూఏఈ గెలిస్తే మాత్రం గ్రూప్ Dలో పెద్ద సంచలనమే..