టీవీ ఆర్టిస్ట్ కొమురక్కపై కేసు

టీవీ ఆర్టిస్ట్ కొమురక్కపై కేసు

షాద్‌‌నగర్, వెలుగు: టీవీ ఆర్టిస్ట్ కొమురక్క అలియాస్ కొమురయ్యపై గురువారం షాద్‌‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్‌‌నగర్ సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌‌నగర్ మండలం కాశీ రెడ్డిగూడ గ్రామానికి చెందిన శ్రీనాథ్ కొన్నాళ్లుగా కొమురయ్య వద్ద సైడ్ ఆర్టిస్ట్‌‌గా పనిచేస్తున్నాడు.

వివాదాల కారణంగా ఆరు నెలల క్రితం శ్రీనాథ్ పని మానేశాడు. గత నెల 29న యాక్టింగ్ రోల్ ఉందని చెప్పి శ్రీనాథ్‌‌ను రాయికల్ టోల్‌‌గేట్ వద్దకు కొమురయ్య పిలిపించాడు. అక్కడి నుంచి అప్పారెడ్డిగూడ డైమండ్ వెంచర్ వద్దకు తీసుకెళ్లి రాజేశ్, బాబుతో కలిసి కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో షాద్‌‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.