కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.94 లక్షలు

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ.94 లక్షలు

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి హుండీ ఆదాయం రూ.94.93లక్షలు వచ్చింది. సోమవారం ఈవో కట్ట సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో మల్లికార్జునస్వామి ఆలయ ముఖమండపంలో హుండీలను ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సేవాసమితి సభ్యులు లెక్కించారు. 

ఈ సందర్భంగా 47 రోజులకు గానూ హుండీ ఆదాయం నగదు రూ.94,93,627, మిశ్రమ బంగారం 58.6గ్రాములు, మిశ్రమ వెండి 3.5కేజీలు, విదేశీ కరెన్సీ నోట్లు 32 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.