తెలంగాణ విషయంలో పవన్ కల్యాణ్ మిస్ గైడ్ అయ్యాడు

తెలంగాణ విషయంలో పవన్ కల్యాణ్ మిస్ గైడ్ అయ్యాడు

తెలంగాణలో ఆంధ్రులపై దాడులు జరిగాయంటూ ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. పవన్ కల్యాణ్ తెలిసి మాట్లాడుతున్నారా.. లేక తెలియక మాట్లాడుతున్నారా అంటూ పెద్దఎత్తున ఆయనపై విమర్శలు వచ్చాయి. దీనిపై పవన్ కల్యాణ్ కు సన్నిహితుడు… ప్రముఖ సినీ రచయిత కోనవెంకట్ స్పందించారు. పవన్ కల్యాణ్ నిజాయితీ ఉన్న నాయకుడు అనడంలో తనకు సందేహం లేదన్నారు. ఐతే.. తెలంగాణ విషయంలో పవన్ కల్యాణ్ ను ఎవరో మిస్ గైడ్ చేస్తున్నారనీ… అది చెక్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలని ఆయనకు సూచించినట్టు కోన వెంకట్ వివరించారు.

కొద్దినెలల కిందట తెలంగాణ సీఎం కేసీఆర్ ను పవన్ కల్యాణ్ కలిశారనీ.. సామరస్య పరిపాలన గురించి పవన్ కల్యాణ్ బహిరంగంగానే ఓ ప్రకటన చేసి ఉన్నారని గుర్తుచేశారు కోనవెంకట్. అలా మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తనకు సందేహం కలిగిందని.. అందుకో ఓసారి అలర్ట్ చేసినట్టుగా వివరించారు కోన వెంకట్. రాజకీయంగా పవన్ కల్యాణ్ కు మంచి విజయం దక్కాలని ఆశించేవాళ్లలో తాను మొదటివాడినని చెప్పారు కోన వెంకట్.

ఓ తెలుగు పత్రికలో తన గురించి వచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని పాయింట్లు తీసేశారని.. వాటి గురించి వివరణ ఇచ్చారు కోనవెంకట్. తన తాత కోన ప్రభాకర్ రావు, బాబాయి కోన రఘుపతి, తన బావ ద్రోణంరాజు శ్రీనివాస్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారనీ.. వైసీపీ తమ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకుందని చెప్పారు కోన వెంకట్. ఐతే… రాజకీయాలు వేరు.. వ్యక్తిగత ఇష్టాఇష్టాలు వేరన్నారు. రాజకీయ ఆలోచనలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక స్తోమతలు.. ఇవన్నీ స్నేహానికి మాత్రం అడ్డుగోడలు కాకూడదని వివరించారు కోనవెంకట్.