నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడు

నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడు

హైదరాబాద్‌, వెలుగు : కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, ఉద్యమకారుడిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా ఆయన జీవితం రేపటి తరానికి ఆదర్శప్రాయమని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే చాకలి ఐలమ్మ సహా ఉద్యమకారులకు అడ్వకేట్‌గా సేవలందించారని గుర్తు చేశారు. చేనేత రంగంలో ప్రతిభ కనబరిచినవారికి ఆయన పేరుతో అవార్డులు అందజేస్తున్నామన్నారు.