రాహుల్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ అప్రజాస్వామికం..ఓటు చోరీపై సమగ్ర విచారణ చేపట్టాలి :  మాజీ  మంత్రి కొండా సురేఖ

రాహుల్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ అప్రజాస్వామికం..ఓటు చోరీపై సమగ్ర విచారణ చేపట్టాలి :  మాజీ  మంత్రి కొండా సురేఖ

వరంగల్‌‌‌‌, వెలుగు: ఓటు హక్కుపై ప్రశ్నిస్తున్న రాహుల్‌‌‌‌గాంధీని అరెస్ట్‌‌‌‌ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఓటుచోరీపై విచారణ చేపట్టాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ గురువారం వరంగల్‌‌‌‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌‌‌‌ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్‌‌‌‌ జంక్షన్‌‌‌‌ వరకు ర్యాలీ సాగింది.

ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటుచోరీ, ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ వ్యవహారశైలిపై అభ్యంతరాలు ఉన్నాయని, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌‌‌‌ మీసాల ప్రకాశ్‌‌‌‌, కాంగ్రెస్​ నేత నవీన్‌‌‌‌రాజ్‌‌‌‌, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.