కొండమల్లేపల్లి పశువుల సంతలో భారీ అవినీతి.. పోలీసుల అదుపులో  మాజీ కాంట్రాక్టర్

కొండమల్లేపల్లి పశువుల సంతలో భారీ అవినీతి.. పోలీసుల అదుపులో  మాజీ కాంట్రాక్టర్

నల్గొండ, వెలుగు :  నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పశువుల సంత నిర్వహణలో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదేండ్లుగా రాజకీయ పలుకుబడితో బహిరంగ వేలం నిర్వహించకుండా సంతను నడుపుతున్న సదరు కాంట్రాక్టర్, గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో నకిలీ డిపాజిట్ ఓచర్లను సృష్టించి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. 

నూతన సర్పంచ్ పసునూరు యుగేందర్ రెడ్డి, పాలకవర్గం ఫిర్యాదుతో జిల్లా అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా, బ్యాంకు ఖాతాలో నగదు జమ కాకుండానే నకిలీ రసీదులు సమర్పించినట్లు నిర్ధారణ అయింది. ఈ నెల 31తో సంత గడువు ముగియనున్న నేపథ్యంలో, గత పదేండ్ల అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని విచారిస్తున్నారు.