నల్గొండ జిల్లాలో ఇంధన కొరత లేదు..కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ జిల్లాలో ఇంధన కొరత లేదు..కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు:  నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందనే వదంతులను నమ్మవద్దని, జిల్లాలో సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గృహ అవసరాలకు వాడాల్సిన సిలిండర్లను అక్రమంగా వ్యాపారాలకు వాడుతున్న వారిపై తనిఖీలు చేపట్టి 316 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని, ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.

మరోవైపు, ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నందున ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, వ్యవసాయ, చిరు వ్యాపారుల రుణాల గ్రౌండింగ్ లక్ష్యాలను బ్యాంకర్లు ఈ నెల 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే క్రమంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ రూపొందించిన రూ.16,861 కోట్ల 'పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్'ను ఆయన ఆవిష్కరించారు. బ్యాంకర్లు చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు, విద్యా రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.