‘కూ’ యాప్ లో అందుబాటులోకి టాపిక్స్ ఫీచర్

 ‘కూ’ యాప్ లో  అందుబాటులోకి టాపిక్స్ ఫీచర్

హైదరాబాద్, వెలుగు: మల్టీలాంగ్వేజ్​ సోషల్ మీడియా ప్లాట్‌‌ఫాం ‘కూ’ యాప్ లో  10 భాషల్లో  ‘టాపిక్స్’ అనే ఫీచర్​నుఅందుబాటులోకి తెచ్చింది. వివిధ భాషల యూజర్లు తమకు నచ్చిన భాషలో నచ్చిన అంశంపై కంటెంట్​ను చదువుకోవచ్చు. హిందీ, బంగ్లా, మరాఠీ, గుజరాతీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ, పంజాబీ  ఇంగ్లిష్ లాంటి 10 భారతీయ భాషలలో ఈ ఫీచర్‌‌ని ప్రారంభించిన మొదటి  ఏకైక ప్లాట్‌‌ఫాం కూ!  ఇందులో కవిత్వం, సాహిత్యం, కళ  సంస్కృతి, క్రీడలు, సినిమాలు, ఆధ్యాత్మికత వంటి అంశాలపై కంటెంట్​ ఉంటుంది. టాపిక్‌‌ల ద్వారా యూజర్లు తమకు అత్యంత అనువైన కంటెంట్​ను చూడొచ్చు. ఉదాహరణకు ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు  సమాచారాన్ని కోరుకునే యూజర్​.. టీకా, జీవనశైలి వ్యాధులు, డాక్టర్ల నుండి ఆరోగ్య సంరక్షణ చిట్కాల కోసం టాపిక్స్ ట్యాబ్‌‌లోని 'ఆరోగ్యం' విభాగాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది.

కూ కో–ఫౌండర్​ మయాంక్ బిదావత్కా మాట్లాడుతూ 10 భారతీయ భాషలలో టాపిక్‌ ను ప్రారంభించిన మొదటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తమది అయినందుకు గర్విస్తున్నామన్నారు. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు ఆసక్తి ఉన్న కంటెంట్‌ను చూడొచ్చని,  తాము ప్రతి నెలా 20 లక్షలకు పైగా టాపిక్‌లను అందిస్తున్నామని అన్నారు. కూ ఒక సంవత్సరం క్రితమే 10 లక్షల డౌన్​లోడ్​ మార్క్ ను సాధించిందని చెప్పారు. భవిష్యత్తులో 100 లక్షల డౌన్​లోడ్​లను సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.