"కూ" యాప్ నుంచి భారీగా లేఆఫ్స్

"కూ"  యాప్ నుంచి భారీగా లేఆఫ్స్

భారత మార్కెట్లో పోటీపడుతున్న  ‘కూ’ సంస్థ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో 30శాతం ఉద్యోగులను తొలగించింది.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ తన సిబ్బందిలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది.కంపెనీ నష్టాలు భరించలేక, నిధులను సమీకరించలేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రిమూవ్​ చేసిన ఉద్యోగులకు పరిహారం ప్యాకేజీలు, ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించడం, కొత్త ఉద్యోగాలను అన్వేషణలో సాయం అందించడంలో  కూ మద్దతు ఇస్తుందని నివేదించింది. కంపెనీలో సుమారు 260 మంది ఉండగా వీరిలో 30శాతం మందిని తాజాగా తొలగించింది.

మూడేళ్ల క్రితం లాభం.. ఇప్పుడు నష్టం

గతంలో లాభాల్లో ఉన్న సంస్థ ప్రస్తుతం ఆదాయాన్ని క్రమంగా కోల్పోయింది. దీనిపై స్పందించిన కంపెనీ ప్రతినిధి ఒకరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వృద్ధి కంటే సామర్థ్యంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాయని, ఆదాయ-వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించడంపై పని చేస్తున్నాయన్నాయి.మూడేళ్ల క్రితం ప్రారంభమైన కూ,  భారత ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన ప్రతికూల చర్చల ద్వారా లాభపడింది. ఆ సమయంలో చాలామంది ట్విట్టర్‌ను వీడి కూలో ఖాతాలను తెరిచారు. అయితే, అనంతర పరిణామాల్లో కంపెనీ నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది.