ఓట్లు చీల్చేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర :  కూన శ్రీశైలం గౌడ్

ఓట్లు చీల్చేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర :  కూన శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల,వెలుగు: బీజేపీకి పడే ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని డ్రామాలడినా కుత్బుల్లాపూర్​లో కమలం జెండా ఎగురుతుందని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు.  మంగళవారం సెగ్మెంట్​లోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోతాయన్నారు.

కుత్బుల్లాపూర్ ​సెగ్మెంట్ అభివృద్ది చెందాలంటే  బీజేపీని గెలిపించాలన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్​లోని​ హమాలీ లతో  శ్రీశైలం గౌడ్ సమావేశమయ్యారు. బీజేపీ అధికారంలోకి రాగానే కార్మిక బోర్డు ఏర్పాటు చేస్తా మని చెప్పారు.  ఆరోగ్య బీమాతో పాటు జీడిమెట్లలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హమీ ఇచ్చారు.