ఎలక్ట్రిక్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ బైక్: మీకు ఏది బెస్ట్, ఎలా తెలుసుకోవాలంటే...!

ఎలక్ట్రిక్ స్కూటర్ vs ఎలక్ట్రిక్ బైక్: మీకు ఏది బెస్ట్,  ఎలా తెలుసుకోవాలంటే...!

ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. అయితే చాలా మందికి ఎలక్ట్రిక్  స్కూటర్ కొనాలా ? లేక ఎలక్ట్రిక్  బైక్ కొనాలా ? అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. మన అవసరానికి ఏది కరెక్టో ఈ చిన్న పోలికల ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు...

1. నడపడానికి ఏది ఈజీ ? 
ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఓలా, ఏథర్ స్టైలిష్‌గా ఉంటాయి. వీటిపై ఎక్కి దిగడం చాలా ఈజీ. సిటీ ట్రాఫిక్‌లో ఇంకా ఈజీగా నడపవచ్చు. ఎవరైనా సరే మహిళలు, వృద్ధులు కూడా చాలా కంఫర్ట్‌గా నడపవచ్చు.

ఎలక్ట్రిక్ బైక్స్  ఇవి చూడటానికి మామూలు బైక్స్ లగే స్పోర్టీగా ఉంటాయి. అయితే ట్రాఫిక్‌లో వీటిని హ్యాండిల్ చేయడం స్కూటర్ కంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు.

2. మైలేజీ అండ్  రేంజ్
ఎలక్ట్రిక్  స్కూటర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 80 నుండి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఆఫీసు పనులకు, పిల్లలను స్కూల్లో దింపడానికి బాగా సరిపోతుంది.

ఎలక్ట్రిక్  బైక్స్ లో రివోల్ట్, అల్ట్రావయోలెట్ లాంటి బైక్‌లు ఎక్కువ దూరం ప్రయాణించే వారికి బాగుంటాయి. మీరు హైవేలపై వెళ్లాలన్నా లేదా లాంగ్ జర్నీలు చేయాలన్నా ఈ బైక్‌లే బెస్ట్ ఛాయిస్.

3. స్పీడ్ & పవర్ 
ఎలక్ట్రిక్   స్కూటర్ అయితే  సిటీ రోడ్లపై స్మూత్‌గా వెళ్లడానికి  సరిపోతాయి. వీటి స్పీడ్ కంట్రోల్ చేయగలిగేలా ఉంటుంది.

కానీ మీకు స్పీడ్ కావాలంటే బైక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లగలవు. వేగంగా వెళ్లేటప్పుడు కూడా బైక్ రోడ్డుపై చాలా గ్రిప్‌గా, స్థిరంగా ఉంటుంది.

4. లగేజ్ పెట్టుకునే ఫెసిలిటీ 
ఏదైనా వస్తువులు/లగేజ్ క్యారీ చేయడానికి స్కూటర్లే కింగ్ అని చెప్పొచ్చు. సీటు కింద హెల్మెట్ పెట్టుకోవచ్చు, ముందు ఖాళీ ప్లేస్‌లో సమన్లు/ లగేజ్ బ్యాగ్స్  పెట్టుకోవచ్చు.

 బైక్‌పై సామాను పెట్టుకోవడానికి స్థలం ఉండదు. కానీ ఇవి గుంతల రోడ్లపై ప్రయాణించేటప్పుడు షాక్ అబ్జార్బర్స్ (సస్పెన్షన్) ద్వారా ఎక్కువ సౌకర్యాన్ని ఇస్తాయి.

5. టెక్నాలజీ ఫీచర్లు
ఈ రెండు రకాల్లోనూ ఇప్పుడు అదిరిపోయే ఫీచర్లు వస్తున్నాయి:
*టచ్ స్క్రీన్ డిస్‌ప్లేలు.
*ఫోన్ కనెక్టివిటీ (బ్లూటూత్).
*బ్రేక్ వేసినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయ్యే సిస్టమ్ ఉంది

ఫైనల్‌గా  ఏది కొనొచ్చు అంటే ?
*మీకు బడ్జెట్ తక్కువగా ఉండి, కేవలం సిటీలో తిరగడానికి, సామాను/లగేజ్  తెచ్చుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి.
*మీకు స్టైల్ ముఖ్యం, వేగం కావాలి, వీకెండ్స్‌లో లాంగ్ డ్రైవ్ వెళ్లాలి అనుకుంటే ఎలక్ట్రిక్ బైక్ తీసుకోండి.
*సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలకు స్కూటర్ ఆల్ రౌండర్ లాగా పనికొస్తుంది. మీ రైడింగ్ స్టైల్‌ని బట్టి నిర్ణయం తీసుకోండి!