మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణస్వీకారం

మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణస్వీకారం

ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి  ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్  పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపారు.  

దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 104 కు చేరింది. మజ్లిస్ కు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.  టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కూసుకుంట్ల 10 వేల 309 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అక్కడ కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. కూసుకుంట్ల విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాను టీఆర్ఎస్  స్వీప్ చేసింది.