ఉస్మానియా యూనివర్సిటీలో.. జగిత్యాల యువకుడికి పీహెచ్‌‌డీ పట్టా

ఉస్మానియా యూనివర్సిటీలో.. జగిత్యాల యువకుడికి పీహెచ్‌‌డీ పట్టా
  • జియోఫిజిక్స్‌‌లో సాధించిన కొప్పు తిరుపతి 

జగిత్యాల సిటీ, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లొత్తునూరుకు చెందిన కొప్పు తిరుపతి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌‌డీ పట్టా అందుకున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన తిరుపతి.. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఉస్మానియాలో జియోఫిజిక్స్‌‌లో పీజీ చేసిన అతడు.. తర్వాత అదే వర్సిటీలో పీహెచ్‌‌డీలో చేరాడు. ఓవైపు పీహెచ్‌‌డీ చేస్తూనే, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాడు. ఈ క్రమంలో 2024 అక్టోబర్‌‌‌‌లో స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌‌మెంట్‌‌లో అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్‌‌గా జాబ్ సాధించాడు. 

అటు జాబ్‌‌ చేస్తూనే.. ఇటు పీహెచ్‌‌డీ కూడా పూర్తి చేశాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిటైర్డ్) డాక్టర్ రామ్‌‌రాజ్ మాథుర్ పర్యవేక్షణలో రిమోట్ సెన్సింగ్, మ్యాగ్నెటిక్ అండ్ వీఎల్‌‌ఎఫ్​ (ఈఎం) సర్వేస్ ఫర్ ఎక్స్‌‌ప్లోరేషన్ ఆఫ్ బ్రాండెడ్ ఐరన్ ఓర్ ఫామేషన్ అనే అంశంపై పరిశోధన చేశాడు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో పాటు పీహెచ్‌‌డీ పూర్తి చేసిన తిరుపతిని పలువురు అభినందించారు.