నాడు సింగరేణి ఉద్యోగి ..నేడు మంత్రి

నాడు సింగరేణి ఉద్యోగి ..నేడు మంత్రి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కొప్పుల ఈశ్వర్ 1959 ఏప్రిల్ 20న కుమ్మరికుంట గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు కొప్పుల లింగయ్య, మంగమ్మ. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల బీఏ చదివారు. 26 ఏళ్లు సింగరేణి ఎంప్లాయిగా పనిచేశారు. కొప్పులకు భార్య స్నేహలత. కూతురు నందిని ఉన్నారు.

1994లో టీడీపీలో చేరి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన కొప్పుల ఈశ్వర్… అదే ఏడాది మేడారం అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. 2001లో టీఆర్ఎస్ లో చేరిన కొప్పుల వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2018 వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొప్పుల. 2004లో జనరల్ ఎన్నికల్లో.. 2008 బై ఎలక్షన్ లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కొప్పుల. 2009 జనరల్ ఎలక్షన్, 2010 బై ఎలక్షన్, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో వరుసగా ధర్మపురి నుంచి గెలిచారు కొప్పుల ఈశ్వర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. మొదటి ప్రభుత్వంలో.. 2014 నుంచి 2018మధ్య ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేసిన కొప్పులకు ఇప్పుడు మంత్రి పదవి దక్కింది.