గూగుల్‌ నుంచి సరికొత్త ‘కోర్మో’ జాబ్ యాప్

గూగుల్‌ నుంచి సరికొత్త ‘కోర్మో’ జాబ్ యాప్

లింక్‌డిన్, నౌకరీకి పోటీ
కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు

న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం వేచిచూస్తూ.. తమకు సెట్ అయ్యే ఉద్యోగం వెతుక్కునే వారి కోసం గూగుల్ కోర్మో యాప్‌‌‌‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఈ యాప్ ఎంట్రీ లెవెల్ జాబ్స్‌‌‌‌ను వెతికేందుకు యూజర్లకు సహకరిస్తుంది. ఉద్యోగం వెతుక్కునే వారు కొత్త స్కిల్స్‌‌‌‌ను నేర్చుకోవడానికి, కరిక్యులమ్ వీటా(సీవీ) ప్రిపేర్ చేసుకునేందుకు సాయం చేస్తుంది. గూగుల్ అంతకుముందు 2018లోనే ఈ ఎంప్లాయిమెంట్ అప్లికేషన్‌‌‌‌ను లాంఛ్ చేసింది. బంగ్లాదేశ్‌లో దీన్ని తొలుత ప్రారంభించింది. ఆ తర్వాత ఇండోనేషియాకు విస్తరించింది. లక్షల మంది జాబ్ సీకర్స్‌‌‌‌ను కోర్మో యాప్, ఎంప్లాయర్స్‌‌‌‌తో కనెక్ట్ చేయనుంది. మైక్రోసాఫ్ట్ లింక్‌‌డిన్‌కు, నౌకరీకి, టైమ్స్ జాబ్స్ కు పోటీగా గూగుల్ దీన్ని లాంఛ్ చేసింది. కోర్మో జాబ్స్ అప్లికెంట్‌ ప్రొఫైల్‌‌‌‌ను ఆధారంగా చేసుకుని, తగిన జాబ్స్‌‌‌‌ను రికమెండ్ చేస్తుంది. నచ్చిన జాబ్‌‌‌‌కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కెరీర్‌‌‌‌‌‌‌‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అవసరమైన టూల్స్‌‌‌‌ను కోర్మో అందిస్తుంది. క్యాండిడేట్‌ ప్రొఫైల్‌కు కొత్తస్కిల్స్ ఏమీ అవసరం అవుతాయో చెబుతుంది. గతేడాదే కోర్మో జాబ్స్‌‌‌‌ను గూగుల్ ఇండియాలోకి తెచ్చింది. గూగుల్ పేలో జాబ్స్ స్పాట్ సెక్షన్ ద్వారా ఇండియన్ మార్కెట్‌కు కోర్మో జాబ్స్‌‌‌‌ను అందించింది. గూగుల్ పే సహకారంతో, జొమాటో లాంటి కంపెనీలు 20 లక్షల వెరిఫైడ్ జాబ్స్‌‌‌‌ను కోర్మో జాబ్స్‌‌‌‌లో పోస్ట్ చేశాయి. అయితే ఈ లిస్టింగ్ నుంచి ఎంత మంది ఉద్యోగం పొందారనేది తెలియలేదు. కొత్త ఫీచర్లపై తాము కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తామని గూగుల్ కోర్మో జాబ్స్ రీజనల్ మేనేజర్ బిక్కీ రస్సెల్ చెప్పారు.

For More News..

ఏ శిక్షకైనా రెడీ.. సారీ మాత్రం చెప్పను

రెండేళ్లలో కరోనాకు వ్యాక్సిన్ రాకుంటే 10 లక్షల మంది తగ్గుతరట

టీచర్లకు చెప్పొస్తలె.. పిల్లలకు సమజైతలె