కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బరిలో 354 మంది

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్  బరిలో 354 మంది
  •     41వ డివిజన్​లో 21 ఏండ్ల యువతి
  •     10 డివిజన్​లో 75 ఏండ్ల వృద్ధురాలు పోటీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు 354 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో 30 ఏండ్ల వయసులోపు వారు 35 మంది బరిలో ఉన్నారు. 60 ఏండ్లకు పై బడినవారు 20 మంది ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అతి తక్కువ వయసు 21 ఏండ్ల యువతి ఎన్.సుమిత్ర 41వ డివిజన్ నుంచి కాంగ్రెస్​తరపున పోటీ చేస్తున్నారు.

అత్యధిక వయసు గల 75 ఏండ్ల వృద్ధురాలు వేల్పుల వీరమ్మ 10వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. దాదాపు 20 మందికి పైగా నిరక్షరాస్యులు, మరో 20 మందికి పైగా పీజీ చేసిన వారు బరిలో నిలిచారు. దాదాపు 35 మందికి పైగా వ్యాపార్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.