వడ్డీ లేని రుణాలతో మహిళల్లో ఆర్థికాభివృద్ధి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

వడ్డీ లేని రుణాలతో మహిళల్లో ఆర్థికాభివృద్ధి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  వడ్డీలేని రుణాలతో మహిళల్లో ఆర్థికాభివృద్ధి పెరుగుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్​లో మంగళవారం నిర్వహించిన వడ్డీలేని రుణాల పంపిణీ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర వ్యాప్తంగా రూ. 304కోట్ల వడ్డీలేని రుణాలను ప్రభుత్వం విడుదల చేయడం అభినందనీయమన్నారు. రుణాలను క్రమశిక్షణతో చెల్లించడం వారి దక్షతకు అద్దం పడుతోందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్​ బంకులు, బస్సులు, సోలార్​ పవర్​ ప్లాంట్లు వంటి వాటిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం మహిళలను వ్యాపార వేత్తలకు తీర్చిదిద్దుతోందన్నారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లతో పాటు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తొందన్నారు. కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ మాట్లాడుతూ జిల్లాకు రూ. 10.74కోట్ల వడ్డీలేని రుణాలు సాంక్షన్​ అయ్యాయన్నారు. 11,423 మహిళా సంఘాలకు లబ్ది చేకూరనుందన్నారు.  

అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్​ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రాంలో సహకార సంఘం అధ్యక్షులు మండే హనుమంతరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పసుపులేని వీరబాబు, తహసీల్దార్​ పుల్లయ్య, అదనపు డీఆర్​డీఏ నీలేష్​  పాల్గొన్నారు.