రిటైర్మెంట్ తర్వాత కోవింద్ ఎక్కడికెళ్లారంటే..

రిటైర్మెంట్ తర్వాత కోవింద్ ఎక్కడికెళ్లారంటే..
  • కొత్త ఇంట్లోకి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సోమవారం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇకపై ఆయన 12 జన్​పథ్​లోని బంగ్లాలో ఉంటా రు. పదవీకాలం పూర్తవడంతో  రాష్ట్రపతి భవన్​ను కోవింద్​ ఖాళీ చేశారు. ఒకప్పుడు ఈ బిల్డింగ్​లో కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్​ పాశ్వాన్​ ఉండేవారు. 2020లో ఆయన చనిపోయారు. ఆ తర్వాత రాంవిలాస్​ కొడుకు చిరాగ్​ పాశ్వాన్​ అందులో ఉండగా.. ఏప్రిల్​లో ప్రభుత్వం ఖాళీ చేయించింది.

ఆ తరువాత దాన్ని అందంగా ముస్తాబు చేసి కోవింద్​కు కేటాయించింది. ఇక ఆయన రిటైర్మెంట్​ లైఫ్​ను ఇక్కడే గడుపుతారు. 12 జన్​పథ్​లో కోవింద్​కు బంగ్లా కేటాయించడం సంతోషంగా ఉందని న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజుజు ట్వీట్​ చేశారు. బంగ్లాలో కోవింద్​ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు హర్దీప్​సింగ్​ పూరీతో పాటు వీకే సింగ్​ కలుసుకున్నారు. ఆయన్ను కొత్త ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. 

కోవింద్​కు అందే రిటైర్మెంట్​ బెనిఫిట్స్​

  • రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రామ్​నాథ్​ కోవింద్​కు నెలకు రూ.5లక్షల వేతనం ఉండేది. రిటైర్​ కావడంతో.. రాష్ట్రపతి పారితోషికాలు, పెన్షన్​ యాక్ట్​ 1951 ప్రకారం.. రూ.2.50 లక్షల పెన్షన్​ ప్రభుత్వం ఇస్తుంది. 
  • ప్రైవేట్​ సెక్రటరీ, అడిషనల్​ ప్రైవేట్​ సెక్రటరీ, ఒక పీఏ, ఇద్దరు ప్యూన్లు ఉంటారు. ఆఫీసు ఖర్చులకు ఏటా రూ.1లక్ష ఇస్తుంది.
  • ఉచితంగా మెడికల్​ ట్రీట్​మెంట్ అందజేస్తుంది. ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు. ఫస్ట్​ క్లాస్​ టికెట్​ను ప్రభుత్వమే కేటాయిస్తుంది. కోవింద్​ వెంట మరొకరికి కూడా ఫ్రీ ట్రావెల్​ చాన్స్​ ఉంటుంది. విమానం, ట్రైన్ లేదా స్టీమర్​లో కూడా ప్రయాణించవచ్చు.
  • ఆయన ఉండే ఇంటి అద్దెను జీవితాంతం ప్రభుత్వమే భరిస్తుంది. నేషనల్ రోమింగ్ ఫెసిలిటీతో కూడిన మొబైల్, ఒక కారు  కేటాయిస్తుంది.