మంత్రి పదవికి రాజీనామా చేయనున్న కిడారి శ్రావణ్

మంత్రి పదవికి రాజీనామా చేయనున్న కిడారి శ్రావణ్

అమరావతి:  ఏపీ వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేయక తప్పడం లేదు.  చట్టసభల్లో సభ్యుడు కాని శ్రావణ్ 2018 నవంబరు 11న ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రూల్ ప్రకారం అయితే  మంత్రిగా నియమించిన తర్వాత  ఆరు నెలల్లోగా ఏదో ఒక చట్ట సభకు ఎన్నిక కావాలి.  కానీ శ్రావణ్‌ మంత్రి పదవి చేపట్టి మే 10 నాటికి ఆరు నెలలు అవుంది. కాబట్టి ఆయన  మే 11 నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి అనర్హుడు. అసెంబ్లీకి ఎన్నికల రిజల్ట్స్ రానందున ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేయడానికి  ఇంకా సమయం పడుతుంది. చట్టసభల్లో సభ్యుడు కాకపోవడం వలన పదవి నుంచి తప్పుకునే బదులు ఆయనే  10 లోపు రాజీనామా చేస్తే బెటర్ అని సీఎంకు గవర్నర్ నరసింహన్ సంకేతాలిచ్చినట్లు  సమాచారం.