-will-set-up-three-grain-based-ethanol-plants-in-Telangana-AP-,Gujarat_SLvAPwmox2.jpg)
- గుజరాత్‌లోనూ ఒకటి ఏర్పాటు
న్యూఢిల్లీ: క్రిషక్ భారతి కో-–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) మూడు ధాన్యం ఆధారిత ఇథనాల్ ప్లాంట్లను తెలంగాణ, ఏపీతో పాటు గుజరాత్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ .1,100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మక్కలను, నూకలను ఉపయోగించి ఇథనాల్‌ను తయారు చేస్తారు.
ఒక్కో ప్లాంటుకు రోజుకు 250 కిలో లీటరు సామర్థ్యం ఉంటుందని క్రిబ్కో చైర్మన్ చంద్ర పాల్ సింగ్ అన్నారు. ఇవి వచ్చే ఏడాది చివరి నాటికి పనిచేస్తాయని భావిస్తున్నట్లు భావిస్తున్నట్లు సంస్థ ఎండీ రాజన్ చౌదరీ తెలిపారు. ఇంటర్నల్ అక్రూయల్స్, అప్పుల ద్వారా నిధులను సర్దుబాటు చేస్తామని ఆయన చెప్పారు.
పెట్రోల్‌తో కలపడానికి క్రిబ్కో చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇథనాల్‌ను సరఫరా చేస్తోంది. ప్రస్తుతం, పెట్రోల్‌తో ఇథనాల్ బ్లెండింగ్ 12 శాతంగా ఉంది. 2025 నాటికి దీనిని 20 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
గుజరాత్‌లోని హజీరా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తెలంగాణలోని జగిత్యాల వద్ద బయో ఇథనాల్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు క్రిబ్కో 100 శాతం యాజమాన్యంలోని స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) 'క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్' ను ఏర్పాటు చేసింది.
మూడు బయో ఇథనాల్ ప్రాజెక్టుల కోసం లంప్ సమ్ టర్న్ కీ (ఎల్‌ఎస్‌టీకే) ఒప్పందాలను ఎస్పీవీ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో క్రిబ్కో మొత్తం ఆదాయం 95 శాతం పెరిగి 25,715.07 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది 20 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. మొత్తం ఆదాయం అంతకుముందు సంవత్సరంలో 13,194.50 కోట్ల రూపాయలు ఉందని క్రిబ్కో తెలిపింది.