మధురలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆపండి: సుప్రీం కోర్టు

మధురలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆపండి: సుప్రీం కోర్టు

ఉత్తర్​ప్రదేశ్‌ రాష్ట్రం మధురలోని కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వే అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ధర్మాసం ఆగస్టు 16న విచారించింది. 

కూల్చివేతలను 10 రోజులపాటు నిలిపివేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. జస్టిస్​ అనిరుద్ధ బోస్, సంజయ్​ కుమార్ తో కూడిన ధర్మాసనం కేంద్రానికి, అధికారులకు ఇదే అంశంపై నోటీసులు జారీ చేసింది. 

కూల్చివేతలు ఆపాక బాధితుల లిస్ట్​ రెడీ చేయాలని ఆదేశించింది. వారి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. బుల్డోజర్లతో ఇప్పటివరకు 100 ఇళ్లు కూల్చారని, ఇంకో 80 ఇళ్లు మిగిలాయని బాధితులకు న్యాయం చేసి మిగతా ఇళ్లను కూల్చాలని కోర్టుని కోరగా, ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.