Krishna Janmashtami 2025 : ఇంట్లో నుంచే బృందావన్, మధుర, ద్వారకలో కృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు చూడొచ్చు.

Krishna Janmashtami 2025 : ఇంట్లో నుంచే బృందావన్, మధుర, ద్వారకలో కృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు చూడొచ్చు.

ఆగస్టు 16 కృష్టాష్టమి .. శ్రీకృష్ణుని ఆలయాలు చాలా బిజిగా ఉంటాయి.  దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు జనాలు బారులు తీరుతారు. బృందావన్, మధుర, ద్వారకలో కృష్ణుడి పుట్టిన రోజు వేడుకలు అద్భుతంగా జరుగుతాయి.  ఈ  వేడులను ఇంట్లో ఉండే ఆన్​ లైన్​ లో చూసే విధంగా ఏర్పాటు చేశారు.

 ఇండియాలో  ద్వారకాధీష్, బాంకే బిహారీ,మధుర  అనేవి శ్రీ కృష్ణుడికి సంబంధించిన  ముఖ్యమైన దేవాలయాలు. ద్వారకాధీష్ గుడి ద్వారకలో ఉంది, ఇది గుజరాత్ లోని ఒక పురాతన నగరం.బాంకే బిహారీ గుడి బృందావనంలో ఉంది, ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఒక పుణ్యక్షేత్రం.  ఈ  దేవాలయాల్లో శ్రీకృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు భారీగా తరలివస్తారు.  

 జన్మాష్టమి రోజున ఇంట్లో కూర్చుని స్వామిని ఆన్​ లైన్​లో దర్శించే అవకాశాన్ని  కొన్నియాప్​ల ద్వారా కలుగజేశారు.   దివ్య మరాఠీ యాప్‌లో స్వామిని దర్శిస్తే  మూడు కృష్ణ దేవాలయాల గర్భగుడిలోకి వర్చువల్‌గా ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది.  అలా దర్శించిన వారు  ప్రతి ఆలయంలో జరిగే పూజలను ఇంట్లో కూడా చేయగలుగుతారు.

ఏఏ దేవాలయాలంటే..

  • బంకే బిహారీ, బృందావన్
  • శ్రీకృష్ణుని జన్మస్థలం, మధుర
  • ద్వారకాధీష్, గుజరాత్

ఈ దేవాలయాలు ఏడాదంతా బిజీగానే ఉంటాయి.  ఈ దేవాలయాల్లో భగవంతుని దర్శనం చేసుకోవాలంటే చాలాకష్టమని చెబుతుంటారు. అందుకే సామాన్యులు కూడా కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉండి  ప్రసిద్ద దేవాలయాల్లో శ్రీకృష్ణుని గర్భగుడిలో కూర్చున్న అనుభూతిని పొందుతారు. తీర్థం... స్వామికి సమర్పించిన పూలు.. తులసి ప్రసాదం కూడా సమర్పించే అవకాశం ఉందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. రేపు ( ఆగస్టు16)  ఇంట్లో కూర్చొని ద్వారకాధీష్, బాంకే బిహారీ..  శ్రీ కృష్ణ జన్మభూమిని సందర్శించి, పూజ చేసి, పూర్తి హారతి ఇచ్చే ప్లాన్​ చేసుకోండి.