ప్రిక్వార్టర్స్‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌–ప్రతీక్‌‌‌‌

ప్రిక్వార్టర్స్‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌–ప్రతీక్‌‌‌‌

స్పెయిన్‌‌‌‌ : ఇండియా యంగ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ప్లేయర్లు కృష్ణ ప్రసాద్‌‌‌‌ గార్గ్‌‌‌‌–సాయి ప్రతీక్‌‌‌‌ జోడీ.. మాడ్రిడ్‌‌‌‌ స్పెయిన్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌లో ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో అన్‌‌‌‌సీడెడ్‌‌‌‌ కృష్ణ ప్రసాద్‌‌‌‌–సాయి ప్రతీక్‌‌‌‌ 21–15, 28–30, 21–11తో డాంగ్‌‌‌‌ ఆడమ్‌‌‌‌–నైల్‌‌‌‌ యకురా (కెనడా)పై నెగ్గారు. గంట పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియన్‌‌‌‌ జోడీ ర్యాలీలతో చెలరేగింది. తొలి గేమ్‌‌‌‌ ఈజీగా నెగ్గినా రెండో గేమ్‌‌‌‌లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది.

దీంతో గేమ్‌‌‌‌ సుదీర్ఘంగా సాగింది. చివరకు స్మాష్‌‌‌‌లతో కెనడా ప్లేయర్లు గేమ్‌‌‌‌ నెగ్గారు. డిసైడర్‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌–ప్రతీక్‌‌‌‌ క్రాస్‌‌‌‌ కోర్టు విన్నర్లతో ఆకట్టుకున్నారు. 6–0 లీడ్‌‌‌‌తో గేమ్‌‌‌‌ను మొదలుపెట్టి ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా పాయింట్లు నెగ్గి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లారు. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌లో గాయత్రి గోపీచంద్‌‌‌‌–ట్రీసా జోలీకి నిరాశ ఎదురైంది. 18–21, 22–20, 18–21తో అనీ జియు–కెరీ జియు (అమెరికా) చేతిలో ఓడారు.

గంటపాటు జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా జోడీ ర్యాలీలతో ఆకట్టుకున్నా.. మూడో గేమ్‌‌‌‌లో నిరాశపర్చింది. ఇరుజట్ల స్కోరు 18–18తో సమమైన తర్వాత అమెరికా ద్వయం వరుసగా మూడు పాయింట్లతో గెలిచారు.