
ఉద్యోగుల వయోపరిమితి పెంపు ఓ చరిత్రాత్మక తప్పిదమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సర్కార్ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుందని, ప్రజాధనం వృధా అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో లక్షా 98 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. కేవలం 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు.