కృతి కొత్త బిజినెస్​..

కృతి కొత్త బిజినెస్​..

ప్రభాస్​ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon)​ కొత్త బిజినెస్​లోకి అడుగుపెట్టింది. తన పుట్టిన రోజు సందర్భంగా సొంత స్కిన్​కేర్​ బ్రాండ్​ను లాంచ్​ చేసింది. మార్కెట్​లో ఉన్న బ్రాండ్స్​ కన్నా ఇది మెరుగైందని ప్రచారం చేస్తోంది. దీనిపై నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. 

కానీ, కొందరు మాత్రం కృతి కాపీక్యాట్​ అంటూ కామెంట్స్​ చేస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకునే ఇలాంటి కాన్సెప్ట్​ తోనే బ్రాండ్​ లాంచ్​ చేసిందని కృతి తనను కాపీ చేసిందంటూ ట్రోల్​ చేస్తున్నారు. మరికొందరేమో ఇవన్నీ ట్యాక్స్​ తప్పించుకోవడానికేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఏదేమైనా ‘ఆదిపురుష్​’ మూవీ రిజల్ట్​తో సంబంధం లేకుండా కృతికి వరల్డ్​ వైడ్​గా గుర్తింపు తెచ్చింది. దీంతో నాలుగురాళ్లు వెనకేసుకునే పనిలో పడింది ఈ బాలీవుడ్​ భామ. 

ఇక తమన్నా, కాజల్​ అగర్వాల్​, రకుల్ ప్రీత్​ వంటి హీరోయిన్లంతా ఇప్పటికే బిజినెస్​ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్కిన్‌కేర్ బ్రాండ్ కే బ్యూటీ బై కత్రినా కైఫ్ (2019లో లాంచ్ చేయబడింది), ప్రియాంక చోప్రా హెయిర్ కేర్ బ్రాండ్ అనోమలీ (ఆగస్టు 2022లో లాంచ్ చేయబడింది), సోనాక్షి సిన్హా నెయిల్ బ్రాండ్ SoEzi (సెప్టెంబర్ 2023లో లాంచ్ చేయబడింది),  దీపికా పదుకొనే స్కిన్‌కేర్ బ్రాండ్ (82°E బ్రాండ్ లాంచ్ చేయబడింది.. నవంబర్ 2022లో) మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.