తెలంగాణకు36.67 టీఎంసీలు..ఏపీకి 17 టీఎంసీలు

తెలంగాణకు36.67 టీఎంసీలు..ఏపీకి 17 టీఎంసీలు

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణకు 36.67 టీఎంసీలు, ఏపీకి 17 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బుధవారం వాటర్‌ రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. రెండు రాష్ట్రా లు ఈ నెల 31 వరకు నీటి విడుదలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సమర్పించిన ఇండెంట్ల ఆధారంగా రిలీజ్‌ ఆర్డర్‌ ఇస్తున్నట్టు బోర్డుమెంబర్‌ సెక్రటరీ హరికేశ్‌ మీనా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ప్రాజెక్టునుంచి కల్వకుర్తి లిఫ్ట్‌స్కీంకు 7.74 టీఎంసీలు, నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీకి 22.18 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటికి, మిషన్‌ భగీరథకు 7.74 టీఎంసీలు తీసుకునేందుకు అవకాశమిచ్చారు. ఇకఏపీ.. శ్రీశైలం ప్రాజెక్టునుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 8 టీఎంసీలు, పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యు లేటర్‌కు 9 టీఎంసీలు కేటాయించారు.

అందుబాటులో 110 టీఎంసీలు

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లోఎండీడీఎల్‌కు ఎగువన సోమవారం నాటికి 110.44 టీఎంసీలు ఉన్నాయని రిలీజ్‌ ఆర్డర్ ‌లో పేర్కొన్నారు. శ్రీశైలంలో 53.85 టీఎంసీలు ఉండగా ఎండీడీఎల్‌(834అడుగులు)కు ఎగువన 29.67 టీఎంసీలు, సాగర్‌లో131.66 టీఎంసీలు ఉండగా మినిమం డ్రా లెవల్‌పైన 80.87 టీఎంసీలు ఉన్నాయని తెలిపారు.వాటర్‌ ఇయర్‌ ప్రారంభం నుంచి రెండు రాష్ట్రా లు తీసుకుంటున్న నీటిని ఈ రిలీజ్‌ ఆరర్్డ ‌లోనే లెక్కిస్తామని స్పష్టం చేశారు.

క్యారీ ఓవర్‌పై త్రీమెన్‌ కమిటీ

2019–20 వాటర్‌ ఇయర్‌లో తాము తీసుకోలేకపోయిన 29.92 టీఎంసీ నీటిని ఇప్పుడు నాగార్జున సాగర్‌ నుంచి వాడుకుంటామని, అందుకు అవకాశం ఇవ్వాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. అయితే క్యారీ ఓవర్‌ నీటిని వాడుకోవడానికి అవకాశం లేదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్యారీ ఓవర్‌ నీటిపై చర్చించేందుకు ప్రత్యేకంగా త్రీమెన్‌ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మెంబర్‌ సెక్రటరీ రిలీజ్‌ ఆర్డర్ లో ‌లో పేర్కొన్నారు.