Asia Cup 2025: అన్నదమ్ముళ్లు మరోసారి: ఆసియా కప్ 2025.. ఇద్దరు RCB ప్లేయర్స్‌కు టీమిండియాలో ఛాన్స్

Asia Cup 2025: అన్నదమ్ముళ్లు మరోసారి: ఆసియా కప్ 2025.. ఇద్దరు RCB ప్లేయర్స్‌కు టీమిండియాలో ఛాన్స్

ఇంగ్లాండ్ తో టెస్ట్  తర్వాత టీమిండియాకు భారీ గ్యాప్ రానుంది. నెల రోజులకు పైగా భారత క్రికెటర్లకు రెస్ట్ దొరికింది. వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్ 2025లో భారత జట్టు కనిపించనుంది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆసియా కప్ జరగనుంది.  ఈ మెగా టోర్నీకి ఎవరు ఎంపికవుతారో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆసియా కప్ కోసం భారత స్క్వాడ్ ను ఆగస్టు మూడో వారంలో ప్రకటించనున్నారు. ఈ కాంటినెంటల్ టోర్నీలో టీమిండియాను సూర్య కుమార్ యాదవ్ నడిపించనున్నాడు. 15 మంది స్క్వాడ్ లో ఇద్దరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు ఎంపికయ్యే అవకాశముంది. 

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తరపున ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య ఆకట్టుకున్నాడు. టోర్నీ అంతటా తన ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.  బౌలింగ్ లో కృనాల్.. 8.24 ఎకానమీతో 17 వికెట్లు తీసాడు. బ్యాటింగ్‌లో ఒక హాఫ్ సెంచరీ(73*) సాయంతో 109 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్ లో పరుగులు చేయడంతో పాటు స్పిన్ లో వేగం అతన్ని జట్టులో ఎంపిక చేసేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆసియా కప్ కు కృనాల్ పాండ్య ఎంపికైతే హార్దిక్ పాండ్య ఎలాగో జట్టులో ఉంటాడు. దీంతో అన్నదమ్ముల ఆటను ఆస్వాదించే అవకాశం ఫ్యాన్స్ కు దక్కనుంది. 

కృనాల్ పాండ్యతో పాటు టీమిండియాలోకి ఎంపికయ్యే ఛాన్స్ ఉన్న మరో ఆటగాడు జితేష్ శర్మ. ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున పర్వాలేదనిపించే ప్రదర్శన చేసిన జితేష్.. నాకౌట్ మ్యాచ్ ల్లో దుమ్ములేపాడు. ప్లే ఆఫ్స్ కు ముందు లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 33 బంతుల్లోనే 85 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లోనూ పంజాబ్ పై కేవలం 10 బంతుల్లోనే 24 పరుగులు చేసి అదిరిపోయే క్యామియో ఆడాడు. టీమిండియాకు రిజర్వ్ వికెట్ కీపర్ గా జితేష్ ను పరిగణించే అవకాశాలు ఉన్నట్టు టాక్ నడుస్తోంది. 

ఈ సారి ఆసియా కప్ లో మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో  ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. 2023లో జరిగిన గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. ఇండియా మ్యాచ్ ల విషయానికి వస్తే సెప్టెంబర్ 10న యుఎఇతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబిలో ఒమన్‌తో గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్ ఆడనుంది.