పదేళ్లుగా దోపిడీకి గురైన చేవెళ్ల : కేఎస్ రత్నం 

పదేళ్లుగా దోపిడీకి గురైన చేవెళ్ల : కేఎస్ రత్నం 

చేవెళ్ల, వెలుగు:  ఎమ్మెల్యే యాదయ్య అక్రమాలు, అరాచకాలపై కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కేఎస్ రత్నం మండిపడ్డారు. చేవెళ్లలో పేదల భూములు ఆక్రమించి రూ. కోట్లలో వెనకేసుకున్నారని, నామినేటెడ్ పదవులు అమ్ముకున్నారని బీఆర్ఎస్​ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

ఆదివారం చేవెళ్లలో బూత్ స్థాయి కార్యకర్తలు, శక్తి కేంద్రం ఇన్ చార్జ్ లతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులతో చర్చించారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా చేవెళ్ల గడ్డ దోపిడీకి గురైందని విమర్శించారు. చేవెళ్లను మున్సిపాలిటీ చేస్తున్నామని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య ప్రకటించారని, అది ఎంతవరకు వచ్చిందని,  పదేళ్ల కిందట బస్ డిపో కోసం స్థలం సేకరిస్తే, ఇప్పటివరకు ఎందుకు నిర్మించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.