
చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చేవెళ్ల సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండల పరిధిలోని రామన్నగూడ, న్యాలట, తంగడ్ పల్లి, మల్లారెడ్డి గూడ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేఎస్ రత్నం మాట్లాడుతూ.. రేపు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాల్లో కేఎస్ రత్నం నిర్వహించిన ప్రచారానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. అభిమానులు, కార్యకర్తలు, రత్నం కుటుంసభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేత చాకలి శ్రీనివాస్ పాల్గొన్నారు.