
లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా న్యాయవాదులతో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ కి తరలించనున్నారు. రాత్రి 8.45 కి ఫ్లైట్ బుక్ చేసిన ఈడీ అధికారులు.శుక్రవారం (మార్చి 15) మధ్యాహ్నం నుంచిఈడీ, ఇన్కమ్ టాక్స్ అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మొత్తం 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్సీకవిత, ఆమె భర్త, సిబ్బందితో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.
ఈడీ అధికారులు రాత్రి 8.45 కు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా న్యాయవాదులతో ఢిల్లీకి వెళ్లనున్నారు. కవిత నివాసం దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ఈడీకి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ పెండింగ్ లో ఉండగా అరెస్ట్ చేయడం దారుణమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.