ఫ్లైట్ ఎక్కారు.. ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు

 ఫ్లైట్ ఎక్కారు..  ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు

లిక్కర్ స్కామ్  కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి  ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. వారితో పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. సాయంత్రం 6 నుంచి -7 గంటల మధ్య వీరు కవితతో భేటీ అవుతారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ సెంట్రల్ ఆఫీస్‌లో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావటానికి ఒక్కరోజు ముందు కవితను అరెస్ట్ చేయడం సరికాదంటున్నారు బీఆర్ఎస్ నేతలు,  కాంగ్రెస్, బీజేపీ నాయకులు కలిసి కుట్ర చేశాయని ఆరోపిస్తున్నారు.  

మరోవైపు కవితను ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి మార్చి 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర్చాలని ఈడీ అధికారులను ఆదేశించింది. కాగా  లిక్కర్‌ స్కామ్  కేసులో భాగంగా ఈడీ అధికారులు కవితను శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేసి, ఢిల్లీకి తరలించారు.   ఇదిలావుండగా.. కవిత భర్త అనిల్​కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం (మార్చి 18) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.   హైదరాబాద్‌లో సోదాల సందర్భంగా ఈడీ అధికారులు ఈ నలుగురి ఫోన్లను సీజ్‌ చేశారు.