
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ములాఖాత్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు. కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఇరువురు కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్. కవితకు బెయిల్ పిటిషన్ వేసే వరకు ఢిల్లీలోనే ఉండి..న్యాయ నిపుణుల బృందంతో చర్చించనున్నారు. కేటీఆర్, హరీష్. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. జులై 8న కోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరో వైపు ఇవాళ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జులై 18 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అప్పటి వరకు తీహార్ జైలులోనే ఉండాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవితను ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.