అసైన్డ్ ల్యాండ్స్ పై కేటీఆర్ కామెంట్స్ 

అసైన్డ్ ల్యాండ్స్ పై కేటీఆర్ కామెంట్స్ 

హైదరాబాద్: అసైన్డ్ భూముల అమ్మకాలపై రైతులకు సూచన చేశారు మంత్రి కేటీఆర్. వరంగల్ సభలో రాహుల్ అసైన్డ్ భూముల క్రయవిక్రయాల చట్టం తీసుకొస్తామన్నారు. ఈ విషయంపై కేటీఆర్ ను విలేకర్లు ప్రశ్నించగా.. అసైన్డ్ ల్యాండ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలు కావని.. ఎవరూ అమ్మకూడదు కొనకూడదన్నారు. అయితే పేద రైతులు బిడ్డ పెళ్లి కోసమో, చిన్న వ్యాపారమో చేసుకునేవారు అగ్రిమెంట్ ప్రకారం అమ్ముకునేందుకు ఓ అవకాశం ఉందన్నారు. ఇందుకోసం స్థానిక కలెక్టర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని తెలిపారు.

ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్న భూములను అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ గా కన్వర్ట్ చేసి ప్లాటింగ్ చేయవచ్చన్నారు. దీంతో మంచి లేఅవుట్స్ తయారవుతాయని ఇందుకు ఉదాహరణ ఉప్పల్, బగాయత్ లో కూడా చేశామని తెలిపారు. అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ గా కన్వర్ట్ చేసి, మంచి రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ధరకు నాలుగింతలు ఎక్కవ వచ్చే అవకాశం ఉందన్నారు. దీనివల్ల లాభమే కానీ నష్టం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదవానికి అండగా ఉంటుందన్నారు. అసైన్డ్ భూముల అమ్మకాలపై యజమాని ఇష్టపూర్వకంగా ఇస్తేనే ..వారికి లాభం కలుగుతదని విశ్వసిస్తేనే కొనుగోలుదారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేయకూడదన్నారు. అసైన్డ్ భూములపై ఇంకా ఏమైనా అనుమానాలుంటే కలెక్టర్లను అడిగి తెలుసుకోవచ్చారు మంత్రి కేటీఆర్.