అజ్ఞాత సూర్యులను V6 ‘వెలుగు’లోకి తెచ్చింది: కేటీఆర్

అజ్ఞాత సూర్యులను V6 ‘వెలుగు’లోకి తెచ్చింది: కేటీఆర్

వెలుగు క్రికెట్ టోర్నీని మహబూబ్ నగర్ టీమ్ గెలుచుకుంది. నిజామాబాద్ అర్బన్ తో ఫైనల్ లో తలపడిన పాలమూరు.. 26 రన్స్ తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మహబూబ్ నగర్ టీమ్.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 రన్స్ చేసింది. ఛేజింగ్ లో నిజామాబాద్ అర్బన్ 107 పరుగులకే ఆలౌట్ అయింది. ఫైనల్ కు ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  ఎందరో అజ్ఞాత సూర్యులను వెలుగులోకి తెచ్చిన వెలుగుV6 యాజమాన్యానికి అభినందనలు తెలిపారు KTR.  జాతీయ స్థాయిలో ఉన్న చాలామంది ప్లేయర్స్ … గ్రామీణం నుంచి వచ్చినవారే అన్నారు.  గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. గ్రామీణ ప్లేయర్లకు ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ టోర్నీ నిర్వహించామన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకట స్వామి. మొత్తం 130 మ్యాచులు నిర్వహించినట్టు చెప్పారు.

టోర్నీ విజేత పాలమూరు టీమ్ కు కప్ తో పాటు లక్ష రూపాయలు అందుకుంది. రన్నరప్ నిజామాబాద్ టీమ్ కు 50 వేల ప్రైజ్ మనీ అందించారు. విజేతలకు కేటీఆర్ అవార్డులు ప్రదానం చేశారు.  ఇక టోర్నీలో థర్డ్, ఫోర్త్ ప్లేస్ లో నిలిచిన కొత్తగూడెం, రామగుండం జట్లకు 25వేల నగదు బహుమతి అందించారు ఆర్గనైజర్స్.