డీప్ ఫేక్ వీడియోనా లేక : సిద్దరామయ్య వీడియోపై కేటీఆర్ విమర్శలు

డీప్ ఫేక్ వీడియోనా లేక : సిద్దరామయ్య  వీడియోపై కేటీఆర్ విమర్శలు

ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలిచ్చాం కానీ ..డబ్బులెక్కడి నుంచి వస్తాయంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  కామెంట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దీనిని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.. తన ట్విట్టర్లో రీ ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ పై  విమర్శలు చేశారు. 

ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి డబ్బుల్లేవని సిద్ధరామయ్య అంటున్నారు. హామీలు ఇచ్చే ముందు ఆలోచించరా అని ప్రశ్నించారు కేటీఆర్.  తెలంగాణ  భవిష్యత్ కూడా ఇలాగే ఉండబోతుందా అని ధ్వజమెత్తారు. ఏ మాత్రం ప్రణాళిక చేయకుండా అసలు హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

 ఎన్నికల్లో ఓట్ల కోసం  ఏదో అన్నాం అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం.  అంత మాత్రానా అన్ని  ఫ్రీగా ఇవ్వాలా మాకు ఇవ్వాలనే ఉంది. కానీ డబ్బులు లేవు అని అసెంబ్లీలో సిద్ధరామయ్య అన్నట్లు వీడియోలో ఉంది. 

అయితే తన వీడియో ప్రచారం కావడాన్ని సీఎం సిద్ధరామయ్య ఖండించారు. తాను అలా అనలేదని తన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అశ్వత్ నారాయణ, సి.టి.రవి దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. తన  వ్యాఖ్యలను అక్కడక్కడ ముక్కలుగా కట్ చేసి.. ఎడిట్ చేసిన వీడియోను ప్రసారం చేశారన్నారు. ఇది డీప్ ఫేక్ వీడియోగా స్పష్టం చేశారు సిద్ధరామయ్య.