మీరాచోప్రాకు న్యాయం చేస్తామన్న కేటీఆర్

మీరాచోప్రాకు న్యాయం చేస్తామన్న కేటీఆర్

సినిమా హీరోయిన్ మీరా చోప్రా చేసిన కంప్లయింట్ పై మంత్రి కేటీఆర్ రియాక్టయ్యారు. ఆమె చేసిన కంప్లయింట్ పై దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లను కోరుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా చెప్పుకునే కొందరు తనను టార్గెట్ చేస్తూ.. ట్విట్టర్లో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటూ ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది మీరా చోప్రా. ఆమె చేసిన ట్వీట్ ఆధారంగా కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. 67 ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

ఐతే.. తనను అసభ్యంగా తిడుతూ..సోషల్ మీడియాలో దాడి ఆగలేదని ఇవాళ మరోసారి ట్విట్టర్ ద్వారా తెలిపింది  మీరా చోప్రా. తన ట్వీట్ కు… మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితలను ట్యాగ్ చేసింది. మీ తెలంగాణ రాష్ట్రంలో నాకు అవమానం జరుగుతోందంటూ ఆమె  ట్వీట్ చేసింది. గ్యాంగ్ రేప్.. యాసిడ్ ఎటాక్ చేస్తామని… సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారనీ.. క్యారెక్టర్ ను దెబ్బ తీస్తున్నారని ఆమె తన ట్వీట్ లో ఫిర్యాదుచేసింది. హైదరాబాద్ పోలీసులు తన కంప్లయింట్ పై ఇప్పటికే FIR నమోదు చేశారనీ.. మహిళలకు రక్షణ కల్పించేలా దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ఆమె కేటీఆర్ ను కోరారు. మీరా చోప్రా ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. మంత్రి స్పందనకు థాంక్స్ చెప్పిన మీరా చోప్రా… ఇది మహిళల సేఫ్టీకి సంబంధించి చాలా ముఖ్యమైన అంశమనీ.. నేరస్తులను అస్సలు వదిలిపెట్టొద్దని కోరారు.