
హైదరాబాద్, వెలుగు: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ సీట్ ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని భావిస్తున్నది. అందులో భాగంగా శనివారం కేటీఆర్ తన ఇంట్లో పార్టీ ముఖ్య నేతలతో ఉప ఎన్నిక పై సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉప ఎన్నిక కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
సర్వేలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని, కొంచెం కష్టపడితే గెలుపు మనదేనని నేతలకు కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది. బూత్ ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని దిశా నిర్దేశం చేసినట్టు నేతలు చెబుతున్నారు.