
హైదరాబాద్, వెలుగు : శానిటేషన్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్‌ను మేయర్‌కు చెప్పాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటా మని, తమ హయాంలో మూడుసార్లు వేతనాలు పెం చామని ఆయన గుర్తుచేశారు. న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులతో కేటీఆర్ లంచ్ చేశారు.
అ నంతరం కార్మికులతో ముచ్చటించారు. కరోనా పరిస్థితుల్లో శానిటేషన్ కార్మికుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని, మెడికల్ లీవులు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కేటీఆర్ ను కార్మికులు కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులతో సెల్ఫీలు దిగారు. అంతకుముందు మాజీ మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.