ప్రభుత్వ ఉద్యోగానికి ఓ ప్రత్యేకత ఉంది

V6 Velugu Posted on Apr 08, 2021

ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజల సేవల కోసమే ఉపయోగించాలన్నారు మంత్రి కేటీఆర్.హైదరాబాద్ లోని జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ప్రభుత్వ ఉద్యోగానికి ఓ ప్రత్యేకత ఉందని.. ప్రజలకు సేవ అందించడమే పరమావధిగా పని చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు లక్ష 33 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలిగారో... అదేవిధంగా ఒక రూపాయి తీసుకోకుండా నిజాయితీతో ప్రజా సేవ చేయాలన్నారు. జల మండలిని మరింత అభివృద్ధి పథాన నిలిపే విధంగా వినూత్న ఆలోచనలతో పనిచేయాలని సూచించారు.

Tagged KTR, Employees, jalamandali

More News