భవన నిర్మాణ వ్యర్థాల కోసం టోల్ ఫ్రీ నెంబర్

భవన నిర్మాణ వ్యర్థాల కోసం టోల్ ఫ్రీ నెంబర్

హైదరాబాద్ : మున్సిపల్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో హైదరాబాద్ ముందుందన్నారు మంత్రి కేటీఆర్. శనివారం ఆయన భవన నిర్మాణ వ్యర్ధాల కోసం ఈ ప్లాంట్ ను జీడిమెట్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. త్వరలోనే మరొక ఈ ప్లాంట్ ను ఫేతుళ్ళగూడలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. GHMCతో పాటు రాంకీ సంయుక్తంగా ఈ ప్లాంట్ నిర్వహణ చెయ్యబోతుందన్నారు. ఈ ప్లాంట్ 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉందని..ఫెతుళ్ళ గూడతో పాటు మరో రెండు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. ఎందుకు పనికి రాని భవన నిర్మాణ వ్యర్ధాల వేస్ట్ కాకుండా,వాటితో మళ్ళీ సంపద తయారు చేయవచ్చన్నారు.

ఇందుకోసం 1800,1200,72659 టోల్ ఫ్రీ నెంబర్స్ ను ఏర్పటు చేశామన్న కేటీఆర్..ప్రజలు ఈ నెంబర్ కు కాల్ చేసి మీ వ్యర్ధాలను తీసుకెళ్లమని కోరవచ్చన్నారు. రాబోయే రోజుల్లో మూసి నీరు శుభ్రం చేసేందుకు STPలను కూడా పెంచబోతున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. బయో మెడికల్ వేస్ట్, జీవ వ్యర్ధాల వేస్ట్ ను శాస్త్రీయంగా నిర్వహణ చేస్తున్నామని..ప్రతి మున్సిపలిటీలో మానవ వ్యర్ధాల నిర్వహణ కోసం ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వచ్ఛ పట్టణాలు, స్వచ్ఛ నగరాలు తెలంగాణలో ఉన్నాయని.. అందుకు ప్రజలు సహకరించాలన్నారు మంత్రి కేటీఆర్.