గుత్తాజ్వాల అకాడమీ వెబ్ సైట్‌ ఆవిష్కరణ

గుత్తాజ్వాల అకాడమీ వెబ్ సైట్‌ ఆవిష్కరణ

గుత్తాజ్వాల అకాడమీ వెబ్ సైట్ ను ఆవిష్కరణ
ప్రభుత్వం సహాయం చేయలేదు
జనవరి చివరివారంలో అకాడమీ స్టార్ట్

నా కష్టాలు వేరే ప్లేయర్లు పడకుండా చూస్తా: గుత్తా

బాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల అకాడమీ వెబ్ సైట్ ను ఆవిష్కరించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్.  హైదరాబాద్ బేగంపేట లోని పార్క్ హోటల్ లో గురువారం వెబ్ సైట్ ను ప్రారంభించిన అనంతరం అకాడెమీలో చేరుతున్న క్రీడాకారులకు, గుత్తాజ్వాలకు అభినందనలు తెలిపారు.

జనవరి చివరివారంలో అకాడెమీని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు గుత్తాజ్వాల. ఇది మొయినాబాద్ లోని సుజాత స్కూల్ లో GJ మల్టీ స్పోర్ట్స్ అకాడెమీ పేరుతో స్టార్ట్ అవనుందని తెలిపింది. అకాడమీలో 14బ్యాట్మింటెన్ కోర్టులతో పాటు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఇండోర్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 55ఎకరాల్లో 10కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం నుంచి, బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఫెడరేషన్ ల నుంచి ఎలాంటి సహకారం అందలేదని చెప్పారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో వేరే ప్లేయర్ ఎదుర్కోకుండా చూస్తానని తెలిపింది గుత్తా జ్వాల.