హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రోడ్‌ అండ‌ర్ బ్రిడ్జి(RUB) ని మంత్రి కేటీఆర్‌ ఇవాళ(సోమవారం) ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండే మార్గంలో రూ.66.59కోట్ల వ్యయంతో పూర్తయిన హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జిని నిర్మించారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ RUB  ప్రారంభంతో వాహనదారులకు ఊరట లభించనుంది. గతంలో ఈ వంతెన కింద ఎప్పుడు నీరు నిల్వ ఉండేది. దీంతో వాహనదారులు ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం RUB దగ్గర్లోనే ఓ సంపును నిర్మించి అందులో నీటిని నిల్వచేసి మూసాపేట సర్కిళ్లో హరితహారం మొక్కలకు నీరందించనున్నారు.

అంతకుముందు మూసాపేటలో BDCC రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఇది అంబేద్కర్ నగర్ నుంచి డంపింగ్‌ యార్డు వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది.  దీనికోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ విజయలక్ష్మితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.