
అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లోనే ఉన్నాయని.. గడిచిన ఏడాది కాలంలో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ రాయదుర్గంలో బోష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ కొత్త కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం వెనక్కి తగ్గేది లేదని అన్నారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, దానికి తగిన వేగంతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు.
ఇండియాలో మూడవ వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లో క్రియేట్ అయినట్లు కేటీఆర్ తెలిపారు. బోష్ అతిపెద్ద కంపెనీ అని, న్యూ ఏజ్ మొబైల్స్, కార్లలోనూ సాఫ్ట్‌వేర్ పెరుగుతోందన్నారు. ఆటోమోటివ్ రంగంలో బోష్ మరింత రాటుదేలుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.