కేటీఆర్‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌ లీడర్‌‌‌‌.. ఆయన అత్యుత్సాహంతోనే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఓటమి: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి

కేటీఆర్‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌ లీడర్‌‌‌‌.. ఆయన అత్యుత్సాహంతోనే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఓటమి: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ
  • కేసీఆర్‌‌‌‌ కుటుంబ ఆస్తులు మాత్రం వేల కోట్లకు పెరిగాయి
  • వారి హయాంలో అవినీతి జరిగిందని కవితే చెప్తున్నారని వ్యాఖ్య 
  • సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటన

గజ్వేల్/ములుగు/పెద్దపల్లి/కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌, వెలుగు: కేటీఆర్‌‌‌‌ అత్యుత్సాహం కారణంగానే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఓడిపోతోందని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. పార్టీని నడపలేనని కేటీఆర్‌‌‌‌ నిరూపించుకుంటున్నాడని.. అందుకు పార్టీ వరుస ఓటములే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. కేటీఆర్‌‌‌‌ ఒక ఫెయిల్యూర్‌‌‌‌ లీడర్‌‌‌‌ అని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు. సిద్దిపేట జిల్లా పత్తి మార్కెట్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌ వాల్‌‌‌‌ నిర్మాణానికి, ఇంటిగ్రేటెడ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో దుకాణ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్‌‌‌‌ మాట్లాడుతూ.. 2019లో జరిగిన పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో ‘కారు, సారు, పదహారు’ అని చెప్పిన కేటీఆర్‌‌‌‌.. ఏడు పార్లమెంట్‌‌‌‌ సీట్లలో ఓడిపోయారన్నారు. 2023లో కూడా తానే సీఎంను అవుతానని ప్రచారం చేసుకున్నాడని.. ప్రజలు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను గద్దె దింపారని గుర్తు చేశారు. తర్వాత జరిగిన పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో అన్ని సీట్లలో ఓడిపోయిందని, జూబ్లీహిల్స్‌‌‌‌లో ఉప ఎన్నికలో కూడా ఓడిపోవడంతో కేటీఆర్‌‌‌‌ లీడర్‌‌‌‌షిప్‌‌‌‌ ఏపాటిదో అర్థం అవుతున్నదన్నారు. 

ఇప్పుడు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ఎవరు లీడ్‌‌‌‌ చేస్తరో.. పార్టీని ఏం చేస్తారోనని ఆ నాయకుల్లో చర్చ జరుగుతోందన్నారు. పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో ప్రజలను అనేక విధాలుగా మోసం చేశారన్నారు.  ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే.. కేసీఆర్‌‌‌‌ ఫ్యామిలీ ఆస్తులు మాత్రం వేల కోట్లకు పెరిగాయన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కేసీఆర్​ కూతురు కవితే చెబుతున్నారని అన్నారు. 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు స్థానిక ఎన్నికల్లోనూ గుణపాఠం తప్పదన్నారు. జూబ్లీహిల్స్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జిగా వ్యవహరించిన తాను కాంగ్రెస్‌‌‌‌ గెలుపే లక్ష్యంగా పనిచేశానని చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌‌‌, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌ రావుతో కలిసి ప్రజా సమస్యలను 100 రోజుల్లో పరిష్కరించి, అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్​ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసిన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారన్నారు. అనంతరం గజ్వేల్‌‌‌‌ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. హాస్పిటల్‌‌‌‌కు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు, వైద్య పరికరాలు అందిస్తామని చెప్పారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ లింగమూర్తి,  మార్కెట్‌‌‌‌ కమిటీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సర్దార్‌‌‌‌ఖాన్‌‌‌‌ ఉన్నారు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

తమ కుటుంబం ప్రజా సేవకు కట్టుబడి ఉందని, అందుకే తన తండ్రి కాకా వెంకటస్వామితో పాటు తనను, తన కుమారుడు గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించారని మంత్రి వివేక్​అన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తోందన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా వేంనూరులో అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు మంత్రి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. విశాక ట్రస్ట్‌‌‌‌ తరఫున ఆలయం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. 

గ్రామంలో సమ్మక్క, సారలమ్మ జాతర స్థలం వద్ద పనుల కోసం ఎంపీ ల్యాడ్స్​ కేటాయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్‌‌‌‌ జిల్లాలకు ఎరువులను సమకూర్చవచ్చన్నారు. ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్‌‌‌‌ గడ్డం వేణు, కాంగ్రెస్​ నాయకులు కాడె సూర్యనారాయణ, తొగరి తిరుపతి ఉన్నారు. అలాగే, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గాంధారీవనం అర్బన్‌‌‌‌ పార్క్‌‌‌‌లో మంగళవారం ఓపెన్‌‌‌‌ జిమ్‌‌‌‌, రామకృష్ణాపూర్‌‌‌‌లో శ్మశానవాటిక పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

చెన్నూరులో రూ.600 కోట్ల అభివృద్ధి  పనులు

చెన్నూరు నియోజకవర్గంలో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయతీతో కూడిన పాలనను ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఇసుక, భూదందా, దొడ్డుబియ్యం దందాలను అడ్డుకున్నానని చెప్పారు. ఇటీవల మహారాష్ట్రకు తరలిస్తున్న బియ్యాన్ని కూడా పట్టుకున్నామన్నారు. కొందరు వ్యక్తులు వాళ్ల దందాలు సాగడం లేదని ఆఫీసర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.