ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను పున:ప్రారంభించాలని కేంద్రానికి లేఖ రాశారు మంత్రి కేటీఆర్. సీసీఐ కంపెనీ తెరిస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు లేఖ రాశారు. సీసీఐ తిరిగి తెరిస్తే వేలాది ఉద్యోగాలు వస్తాయన్నారు.
తామే అన్ని రకాలుగా సహకరిస్తామంటున్నా సీసీఐని తెరవకపోవడం తెలంగాణ యువత.. ముఖ్యంగా అదిలాబాద్ యువతకు తీరని ద్రోహమేనన్నారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ది చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఎస్ ఐ-పాస్ ద్వారా భారీగా పెట్టుబడులు తెస్తున్నామన్నారు. తమ కృషి వలన అదిలాబాద్ దేవాపూర్ యూనిట్‌లో ఒరియంట్ సిమెంట్ కంపెనీ సుమారు రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టిందన్నారు. కేంద్రం ప్రభుత్వం వేంటనే సీసీఐ పున:ప్రారంభానికి చర్యలు చేపట్టాలన్నారు.
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పున:ప్రారంభించాలి.. కేంద్ర మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్, శ్రీ మహేంద్రనాథ్ పాండేలకు మంత్రి శ్రీ @KTRTRS లేఖ pic.twitter.com/eEY2J4npu5
— TRS Party (@trspartyonline) January 2, 2022