ప్రజల భూములను బినామీల పేరుతో దోచుకున్నడు : గజ్జెల కాంతం

ప్రజల భూములను  బినామీల పేరుతో దోచుకున్నడు : గజ్జెల కాంతం
  •     కేటీఆర్​పై పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రజల భూములను బినామీల పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దోచుకున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో గజ్జెల కాంతం మాట్లాడారు. 

సీఎం రేవంత్ పై కేటీఆర్ భూ కుంభకోణం ఆరోపణలు చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్మరని తెలిపారు. కేటీఆర్ దోచుకున్నదంతా రేవంత్ బయటపెడుతున్నందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం పదేండ్ల పాటు దోచుకున్నదంతా ప్రజలపరం చేసేందుకే సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 

సీఎం రేవంత్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే కేటీఆర్ జైలులో ఉండేవారని పేర్కొన్నారు.