సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ

సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ

ముషీరాబాద్, వెలుగు: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అడిక్​మెట్​లోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ విచారం వ్యక్తం చేశారు. గురువారం బాధిత కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. 

ఇప్పటికే కొందరు తమ పార్టీ నాయకులు జెడ్డా వెళ్లారన్నారు. భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామన్నారు. ఆయన వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలీ,పళ్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.